దక్షిణాది వ్యాంప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ , ఐటెం సాంగ్ భామ సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెర కు ఎక్కించిన డర్టీ పిక్చర్ సినిమా సూపర్, డూపర్ హిట్ నిర్మాతకు కాసుల పంట పండించింది. ఇప్పుడు  దక్షిణాది అడల్ట్ స్టార్ షకీలా జీవిత కథ ను మ్యాజిక్  సినిమా పతాకం పై  దర్శకుడు ఇంద్రజీత్  లోకేష్ తెర కు లెక్కిస్తున్నాడు. షకీలా సినిమా కు నేను పోర్న్ స్టార్ కాదు అని ఉపశీర్షిక గా పెట్టారు  దర్శక, నిర్మాతలు.   ఈ సినిమా లో షకీలా పాత్రని రిచా చద్దా  పోషిస్తోంది.


 షకీలా చిత్రం లో నటి షకీలా కూడా ఒక కీలక పాత్ర లో నటించనున్నట్లు తెలుస్తోంది. 2018లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం  కావడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లో ఆలస్యం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఆగస్టు లో తెలుగు తో పాటు , హిందీ ,  తమిళ, మలయాళ భాషాల్లో  విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.


 షకీలా జీవితం లో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా  కథ రాసుకుని  దర్శకుడు ఈ చిత్రాన్ని తెర కు ఎక్కించాడు. ఒక నిరుపేద యువతి సినిమాల్లో నటించి ధనికురాలిగా మారి , మళ్ళీ ఎలా పేదరాలిగా మారిందనేది చిత్ర కథ అని మేకర్స్ చెబుతున్నారు. షకీలా చిత్రం  ఫస్ట్ లుక్ ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసింది . ఒంటి  నిండా భారీ  నగలు ధరించి రిచా చద్దా కొత్త లుక్ లో కన్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: