రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి చేస్తున్న ‘RRR’ సినిమా షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. గతంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన గాని ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు కావడంతో సినిమా షూటింగ్ ను ఆపేయటం జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ జిమ్ లో కసరత్తులు చేస్తుండగా కాలు బెనకడం తో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న రామ్ చరణ్ ఆ తరువాత వెడ్డింగ్ యానివర్సరీ అంటూ భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా వెళ్లి ఎంజాయ్ చేయడం జరిగింది.

దీంతో రామ్ చరణ్ వెయిట్ మొత్తం పెరగటంతో బాడీ షేప్ మొత్తం పోవడంతో ఇటీవల సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయిన సమయంలో రామ్ చరణ్ కి సీరియస్ గా రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. ఫుల్ వర్క్ ఔట్ బాడీ తో ఫిట్ గా కనబడాలని సీరియస్ గా రాజమౌళి చెప్పడంతో వెంటనే ...రామ్ చరణ్ అమెరికా వెళ్లి తిరిగి కావాల్సిన షేపులు తెచ్చుకునేందుకు శ్రమించబోతున్నాడట.

ఆర్.ఆర్.ఆర్ ప్రారంభం అవుతోంది అనగానే చరణ్ అప్పట్లో అమెరికా వెళ్లి సరైన ట్రైనర్ సమక్షంలో షేపులు మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు మరోసారి అదే శిక్షకుడి దగ్గరకే వెళుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కారణం ఏదైనా ఏదో ఒక రూపంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు ఈ అడ్డంకులు తప్పడం లేదు. ఇటీవలే ఆలియా భట్ అనారోగ్యం కారణంగా పెద్ద పంచ్ పడింది. ఇప్పుడు మళ్లీ చరణ్ తిరిగి షేపుల్లోకి రావడానికి టైమ్ పడుతుంది. అంటే షెడ్యూల్స్ కి ఏదో ఒక రూపంలో బ్రేక్ పడినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: