ఇండియాలో బిగ్ బాస్ కి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే.  బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన ఈ షోకి ఇండియా మొత్తం విపరీతమైన ఆదరణ ఉంది. మొదట హిందీ లో మాత్రమే వచ్చే ఈ షోని ప్రాంతీయ భాషల్లోకి కూడా తెచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ షో విజయవంతంగా నడుస్తుంది. బాలీవుడ్ లో ఈ షో కి వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు.

 

బిగ్ బాస్ షో సీజన్ 13 సెప్టెంబర్ 29న మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా సల్మాన్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. 2010 లో బిగ్ బాస్ హోస్ట్ గా టెలివిజన్ సైడ్ కెరీర్ ను మొదలుపెట్టిన సల్మాన్ కు ఇది 10వ సీజన్ కానుంది. మధ్యలో కొంతమంది సల్మాన్ కి పోటీ ఇవ్వడానికి వచ్చినప్పటికీ షోలు అంతగా క్లిక్కవ్వలేదు. మళ్ళీ సల్మాన్ అయితేనే బిగ్ బాస్ కి బెస్ట్ అని నిర్వాహకులు అతనికి అడిగినంత ఇస్తూ వస్తున్నారు.

 

అయితే ఈ  13 వ సీజన్ కోసం భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నాడట.ఇక ఇప్పుడు 13వ సీజన్ కోసం సల్మాన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు 403కోట్ల రెమ్యునరేషన్ ని ఇవ్వనున్నారని టాక్ వస్తోంది. అంటే సల్మాన్ ఎపిసోడ్ కి 31కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. జరిగే 26 ఎపిసోడ్లకు సల్మాన్ ఈ విధమైన రేటు చెప్పడం నిర్వాహకులకు మింగుడుపడటం లేదు. ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారట బిగ్ బాస్ నిర్వాహకులు.

 

సల్మాన్ ని పక్కన్ పెట్టి వేరే హీరోతో చేద్దామా అని ఆలోచిస్తున్నారట. కానీ ఎవరు కూడా సల్మాన్ లాగా షోని లీడ్ చేయలేకపోతున్నారని దిగులు పడుతున్నారు.  అందుకని ఇక చేసేదేం లేక సల్మాన్ ఖాన్ అడిగినంత ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కానీ ఇది ఎంత వరకు నిజం అనేది ఇంత వరకు తెలిసి రాలేదు. ఇది ఒకవేళ నిజమైతే ఒక బుల్లితెర షో కి ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడంలో రికార్డు సృష్టించిన వాడవుతాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: