నడిగర్ సంఘానికి ఆదివారం రోజున ఎన్నికలు జరిగాయి.  విశాల్ వర్గానికి, శరత్ కుమార్ వర్గానికి మధ్య హోరా హోరీగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం.  మాములు రాజకీయ పార్టీల ఎన్నికలకు తలపించే విధంగా సినిమా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినట్టు తెలుస్తోంది.  


ఈ ఎన్నికలకు ముందు రెండు వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది.  శరత్ కుమార్ ను హీరో విశాల్ పరుష పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. దీనిపై శరత్ కుమార్ స్పందించి తీవ్రంగా వ్యతిరేకించారు.  కాగా, కోర్టు జోక్యంతో ఎన్నికలు సజావుగా ముగిశాయి. 


ఈ ఎన్నికల్లో నడిగర్ సంగంలో సభ్యత్వం ఉన్న అందరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రజినీకాంత్ మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు.  ప్రస్తుతం రజినీకాంత్ ముంబైలో ఉన్నారు.  అక్కడి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నారు.  


కానీ, పోస్టల్ బ్యాలెట్ ఓటు లేట్ కావడంతో వినియోగించుకోలేకపోయినట్టు తెలుస్తోంది.  కానీ అసలు విషయం అదికాదని తెలుస్తోంది.  ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా..రెండో వర్గం వారికి వ్యతిరేకమైనట్టుగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో రజినీకాంత్ ఓటు వేయకుండా ఉన్నారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: