విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మొదటి సినిమా ‘దొరసాని’ ఇంకా విడుదల కాలేదు. రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈమూవీ టీజర్ ఇప్పటికే విడుదలైనా ఆ టీజర్ కు చెప్పుకోతగ్గ స్పందన రాలేదు. దీనితో వచ్చేనెల 12వ తారీఖున విడుదల కాబోతున్న ‘దొరసాని’ మూవీ ఫలితం బట్టి ఆనంద్ దేవరకొండ కెరియర్ ఆధారపడి ఉంటుంది అని భావించారు అంతా. 

అయితే అనూహ్యంగా ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఇతడు అప్పుడే రెండు సినిమాలకు ఓకె చేయడమే కాకుండా తన రెండవ సినిమా షూటింగ్ ను ఆగష్టు నుండి ప్రారంభించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘దొరసాని’ మూవీ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేపధ్యంలో కొనసాగితే ఆనంద్ రెండవ సినిమా కథ గుంటూరు నేపధ్యంలో జరిగే ఒక లవ్ స్టోరీ అని అంటున్నారు. 

వాస్తవానికి టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ డైలాగ్స్ డెలివరీ అంతా తెలంగాణ యాసలో ఉంటుంది. అతడికి ఆంద్రా ప్రాంతంలో కూడ లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నా విజయ్ ఇప్పటి వరకు ఆంధ్రా ప్రాంతం నేపధ్యంలో ఉన్న కథలో కాని లేదంటే ఆంధ్రా ప్రాంతపు యాసలో కాని నటించలేదు. 

అయితే తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే ఆనంద్ దేవరకొండ తెలంగాణ ఆంధ్రా ప్రాంతాల మధ్య సమ న్యాయం పాటిస్తూ ఏకంగా తన రెండవ సినిమా కథను గుటూరు బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా మార్చుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. తాను నటించిన ‘దొరసాని’ ప్రమోషన్ కు తన అన్న విజయ్ దేవరకొండ దూరంగా ఉన్నా ఆనంద్ దేవరకొండ తన సినిమాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలతో ఏకంగా విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అవుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: