సూపర్ స్టార్ రజనీ కాంత్ " కాలా " సినిమాకి దర్శకత్వం వహించిన పా రంజిత్ ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాడు. రజనీ కాంత్ "కబాలి" సినిమాకి కూడా ఈయనే దర్శకత్వం వహించాడు.  ఆ సినిమాతో ఒక్కసారిగా సౌత్ లో పాపులర్ అయ్యాడు.  కబాలి అనుకున్నంత విజయం సాధించకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేసింది. సరికొత్త రికార్డును సృష్టించింది.

 

అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం  చిక్కుల్లో ఇరుక్కున్నాడు. గత కొంత కాలంగా కోర్టు కేసులతో రంజిత్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అరెస్టు చేస్తారేమోనని మూదస్తు బెయిలుకు అప్లై చేసుకున్నాడు.కొన్ని రోజుల క్రితం తిరుప్పనందళ్‌ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాజరాజ చోళన్‌ను కించపరచేలా వ్యాఖ్యలు చేశాడు.

 

అయితే ఆ విషయంపై కేసు నమోదు కావడంతో ఇటీవల కోర్టు అతన్ని 21వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.   ఇక శుక్రవారం వరకు ఆ గడువు ముగియడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని రంజిత్ మరోసారి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే మధురై హైకోర్టు బెయిల్ కు నిరాకరించింది. కేసును 24వ తేదికి వాయిదా వేయడంతో దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

 

ముందస్తు బెయిలు కోసం అప్లై చేసినా కోర్టు నిరాకరించగానే  దర్శకుడు రంజిత్ కి ఏమ్ చేయాలో అర్థం కావట్లేదట. పోలీసులు అరెస్టు చేస్తే ఏం అవుతుందో అని టెన్షన్ పడుతున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగితే ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అయితే అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: