త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 పై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల వాళ్ళు విడుదల చేసిన కొత్త ప్రోమోలో మొహం కనపడకుండా దాచుకున్న వ్యక్తి నాగార్జున అని, ఆయనే ఈ సీజన్ కి హోస్ట్ గా ఎన్నికయ్యారని పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే మరోవైపు ఈ మూడవ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి. 

వారిలో కొందరు సినిమా నటులతో పాటు మరికొందరు బుల్లితెర నటులు కూడా ఉన్నారు. ఇక ఆ వినపడుతున్న పేర్లలో లేడీ యాంకర్ శ్రీముఖి కూడా ఉన్నట్లు సమాచారం. నిజానికి కొద్దిరోజుల క్రితం మరొక లేడీ యాంకర్ లాస్య కూడా బిగ్ బాస్ 3 లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక నిన్నటినుండి ఆమెతోపాటు శ్రీముఖిని కూడా సెలెక్ట్ చేయడం జరిగిందని, అంతేకాక ఆమెను రాబోయే రోజుల్లో ఎటువంటి టెలివిజన్ ప్రోగ్రాంకి సైన్ చేయవద్దని బిగ్ బాస్ టీమ్ కోరినట్లు సమాచారం. అయితే ఈ సీజన్ లో సినిమా నటులు, బుల్లితెర నటులతోపాటు మరికొందరు ఇతర సెలెబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నారట. కానీ ఇప్పటివరకు ప్రచారం అవుతున్న ఈ వార్తలపై బిగ్ బాస్ టీమ్ ఏ మాత్రం స్పందించలేదు. 

నిజానికి ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ని షో ప్రారంభం రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుందని, అందువల్లనే వారు ఇప్పటివరకు ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ పేర్లపై ఎటువంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. ఇక ఒకవేళ ఈ సీజన్ లో లాస్య, శ్రీముఖి వంటివారు కనుక పాల్గొంటే, షోకు మరింత జోష్ తో పాటు క్రేజ్ కూడా ఏర్పడి, మరిన్ని రేటింగ్స్ కూడా వస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం సీజన్ 3 ప్రారంభం వరకు వేచి చూడాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: