సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే విశ్వనటుడు కమల్ హాసన్ అని అంటారు. తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ప్రస్తుతం నట వారుసులు హీరోలుగా వస్తున్న సమయంలో కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది.  స్వతహాగా సింగర్, మ్యూజీషియన్ అయిన శృతి హాసన్ కి వెండి తెరపై తక్కు సమయంలోనే మంచి పేరు వచ్చింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన శృతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 


ఆ మద్య తన బాయ్ ఫ్రెండ్ తో షికార్లు చేసిన పెళ్లి దాకా వచ్చింది..కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.   తన లవ్ బ్రేకప్ అవ్వడంతో ఇప్పుడు కెరీర్ పై దృష్టి సారించింది. తిరిగి నటిగా బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో  టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఆమెను ఓ సినిమా కోసం సంప్రదించాడు. మాస్ మహరాజ రవితేజ, శృతిహాసన్ గతంలో  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘బలుపు’సినిమాలో నటించారు. 

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  మరోసారి ఇదే కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు కూడా క్యూరియాసిటీ ఏర్పడింది. కానీ ఇంతలోనే నిర్మాతలకు షాక్ ఇచ్చింది శృతి హాసన్. దాదాపు కోటిన్నర రూపాయలను పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది.  ఇప్పటికే నాలుగు సినిమాలు వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న రవితేజక మూవీకి భారీ బడ్జెట్ పెట్టే యోచనలో లేరట..ఈ సమయంలో శృతి హాసన్ తగ్గక పోవడంతో  దీంతో మరో ఆప్షన్ కోసం చూస్తున్నారట. రవితేజకి క్రేజ్ తగ్గడంతో అతడి సరసన నటిస్తే తన ఇమేజ్ తగ్గున్తుందేమోనని శృతిహసన్ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: