సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ వస్తుంది. ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. అటు బాలీవుడ్ , టాలీవుడ్, కొలీవుడ్ అంతటా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమాలకు వసూళ్ళు కూడా బాగానే ఉంటున్నాయి. ఈ బయోపిక్ లు ఒక్కోసారి వివాదాల్లో ఇరుక్కుని విడుదలకు కూడా నోచుకోకుండా పోతున్నాయి. అలాగే రిలీజైన బయోపిక్ లు కూడా ఎన్నో వివాదాలకు కారణం అవుతున్నాయి.

 

సిల్క్ స్మిత బయోపిక్ సంచలనం రేపింది. డర్టీపిక్చర్ పేరుతో విద్యాబాలన్ చేసిన ఆ బయోపిక్ బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లేకు మరో హాట్ బయోపిక్ కు రంగం సిద్ధమైంది. ఆ బయోపిక్ పేరు షకీలా . అవును షకీలా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో షకీలా పాత్రను బాలీవుడ్‌ నటి రిచా చద్దా పోషిస్తున్నారు. ఇంద్రజిత్‌ లంకేశ్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

 

డర్టీ పిక్చర్ కంటే బోల్డ్ గా తమ సినిమా ఉంటుందని, ఇప్పటికే షకీలా అనుమతి తీసుకున్నాని చెబుతున్నాడు దర్శకుడు. దక్షిణ చిత్ర పరిశ్రమలో షకీలా అడల్ట్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించింది. షకీలా అంటే అప్పట్లో తెర వేడెక్కిపోయేది. మరి ఇప్పుడు ఈ బయోపిక్ లో ఎంత వేడెక్కిస్తారో చూడాలి.

 

ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగ‌స్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ష‌కీలా కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మరి ఈ సినిమా ఎన్ని వివాదాలకు కారణం అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: