యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పడని అమ్మాయి అంటూ ఉంటుందా చెప్పండి. హీరోయిన్స్ కూడా ప్రభాస్ అంటే ఎగిరి గంతేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఓ లేడీ డైరక్టర్ కు ప్రభాస్ అంటే చాలా ఇష్టమట. ఎంత డైరక్టర్ అయినా ఆమెకు ఓ మనసు ఉంటుంది కదా. ఇంతకీ ప్రభాస్ ను ఇష్టపడే ఆ లేడీ డైరక్టర్ ఎవరంటే నందిని రెడ్డి అని తెలుస్తుంది.


బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం సాహో సినిమా కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రభాస్ సాహో మరో సంచలనం సృష్టించడం గ్యారెంటీ అంటున్నారు.


ప్రభాస్ పై తనకు ఉన్న ఇష్టాన్ని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది నందిని రెడ్డి. ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఉన్నా తను ఎదుట పడితే మాత్రం అసలు నోట మాట రాదని అంటుంది. తను చేసే సినిమా హీరోలతో సరదాగా ఉండే నందిని రెడ్డి ప్రభాస్ పేరు వింటే మాత్రం మెలికలు తిరిగిపోతుంది.


అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా తన సత్తా చాటిన నందిని రెడ్డి ప్రస్తుతం సమంతతో ఓ బేబీ సినిమా చేసింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా జూలై 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంతతో పాటు నందిని రెడ్డి యాక్టివ్ గా పాల్గొంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: