తెలుగు ఇండస్ట్రీలో జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తర్వాత దిల్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఈ చిత్రం తర్వాత నితిన్ కి చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు ఏవీ పడలేదు.  ఆ మద్య ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి హిట్ అయ్యాయి.  ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ మూవీ సక్సె అయ్యింది.  ఆ వెంటనే రెండు మూడు చిత్రాల్లో నటించిన నితిన్ ఘోర పరాజయాన్ని పొందాడు. అయితే హిట్..ఫ్లాప్ లతో తేడా లేకుండా నితిన్ తన కెరీర్ బాగానే కొనసాగిస్తున్నాడు. వరుసగా కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెడుతూ బిజీ హీరోగా మారుతున్నాడు.

తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమా చేస్తోన్న నితిన్ ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే వెంటనే మరో చిత్రంలో నటిస్తున్నారు. భవ్య బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోయే ఈ చిత్రంలో కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై   వెంకీ అట్లూరితో మరో చిత్రంలో నటించబోతున్నాడు. 

ఈ చిత్రంలో కీర్తి సరేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  తే తాజాగా ఈ చిత్రం టైటిల్ ని అనౌన్స్ చేశాడు నితిన్. అదేంటంటే.. 'రంగ్ దే'. ఈ టైటిల్ ఎక్కడ నుండి తీసుకున్నాడో అందరికీ తెలిసిందే.. నితిన్ హిట్ చిత్రాల్లో ఒకటైన 'అ ఆ' చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ 'రంగ్ దే' నే ఇప్పుడు కొత్త టైటిల్ గా మారింది.  మొత్తానికి నితిన్ నటిస్తున్న ఇన్ని ప్రాజెక్ట్ లో ఏ చిత్రం భారీ హిట్ కొడుతూందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: