నాగార్జున ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా అంగీకరిస్తూ ఎగ్రిమెంట్ మీద సంతకం పెట్టె ముందు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీమ్ కు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ షోకు తాను హోస్ట్ చేస్తున్నందుకు కాను తనకు ఇస్తున్న పారితోషికం ఎంత అన్నది ఎట్టి పరిస్తుతులలోను బయటకు లీక్ అవ్వడానికి తాను అంగీకరించను అంటూ నాగ్ కండిషన్ పెట్టినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున పారితోషికం ‘బిగ్ బాస్’ సీజన్ 1 ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన పారితోషికంతో సమానంగా ఉంటుందని లీకులు వస్తున్నాయి. 

అయితే తన పారితోషిక విషయంలో నాగార్జున ఇలాంటి సీక్రెట్ కండిషన్ పెట్టడం వెనుక కారణం తమిళ ‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న కమలహాసన్ అని అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని తమిళ టివిలో హోస్ట్ చేసినందుకు కమల్ కు దక్షిణాది టివి రంగంలో ఏ హోస్ట్ కు ఇవ్వనంత భారీ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. 

అందువల్ల నాగ్ పారితోషికం వార్తలు బయటకు లీక్ అయితే కమలహాసన్ పారితోషికంతో నాగార్జున పారితోషికాన్ని పోలుస్తారు కాబట్టి అలాంటి తలనొప్పులు లేకుండా నాగార్జున ముందుగానే ఈ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ‘బిగ్ బాస్ 3’ సీజన్ విషయంలో హౌస్ మేట్స్ తో వ్యవహరించే విధానంలో తనకు పూర్తి స్వేచ్చ ఉండాలని ప్రతి విషయంలోనూ ‘బిగ్ బాస్’ టీమ్ తనకు సలహాలు ఇవ్వడం తనకు నచ్చదు అని కూడ నాగార్జున ముందుగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన భారీ ఇంటిసెట్టింగ్ నిర్మాణం పూర్తి అయిన నేపధ్యంలో ఆ ఇంటి సెట్ లుక్ బయటపడకుండా ‘బిగ్ బాస్’ టీమ్ పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నాగార్జున హోస్ట్ చేస్తున్నట్లుగా తెలియచేసే మీడియా సమావేశం ఈ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఎట్టి పరిస్తుతులలోను ఈ షోను జూలైలో ప్రసారం ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు పక్కా ప్లాన్ ప్రకారం వ్యూహాలు రచిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: