ఈ నెలాఖరు నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈమూవీ కథ ప్రకారం మహేష్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ తాలూకు యాక్షన్ ఎపిసోడ్స్ ని రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో చిత్రీకరించబోతున్నారు. 

కాశ్మీర్ లో జరగబోతున్న ఈ షెడ్యూల్ లో ఒక భారీ ఫైట్ తో పాటు ఓ థ్రిల్లింగ్ ఛేజ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సీన్స్ చిత్రీకరణ కోసం ఇప్పటికే ఇటలీ నుంచి స్పెషలిస్ట్ ఫైట్ మాస్టర్లను పిలిపించి వారి పర్యవేక్షణలో ప్రస్తుతం మహేష్ ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్. 

ఈ ట్రైనింగ్ వారం రోజుల పాటు కొనసాగే విధంగా దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈసినిమాలోని అత్యంత కీలకమైన ఆర్మీ ఎపిసోడ్ చిత్రీకరణ విషయంలో అనీల్ రావిపూడి బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రెండు వార్ బేస్డ్ మూవీలను అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ఆమూవీలలో ఒకటి ‘బోర్డర్’ మూవీ అయితే రెండోది ‘యుఆర్ఐ’ ఇప్పటికే ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ వార్ సినిమాల హిస్టరీలో ఒక ప్రాముఖ్యత ఉంది. ‘బోర్డర్’ మూవీలో ఉండే ఎమోషనల్ డ్రామాతో పాటు రోమాలు నిక్కబొడుచుకునేలా యుద్ధ సన్నివేశాలు ఉన్న ‘యుఆర్ఐ’ లో ఉన్న అల్ట్రా స్టైలిష్ వార్ ఎపిసోడ్స్ కూడ అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అనీల్ రావిపూడి సినిమాలలోని కామెడీ యాంగిల్ కొత్తగా ఈ దర్శకుడు ఎంచుకున్న ఈ వార్ యాంగిల్ ‘సరిలేరు నీక్వ్వరు’ లో ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అన్న విషయం పై ఈమూవీ విజయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: