అతి త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న క్రేజీ షో బిగ్ బాస్ పై ఇప్పటినుండే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక రెండు సీజన్లు విజ్జయవంతం అయిన తరువాత త్వరలో రాబోతున్న ఈ మూడవ సీజన్ కు యువసామ్రాట్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారు అని ప్రచారం అవుతున్న వార్తలు ఓవైపు మంచి బూస్ట్ ని ఇస్తుంటే, మరోవైపు ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురి పేర్లు ప్రచారం అవుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ షోలో కొందరు నటులు మరియు సెలబ్రిటీలతో పాటు తమ ఆకట్టుకునే యాంకరింగ్ తో యూత్ ని గిలిగింతలు పెట్టె లేడీ యాంకర్లు శ్రీముఖి, లాస్యలు కూడా పాల్గొననున్నారు సమాచారం అందుతోంది. అయితే నిజానికి ఇప్పటివరకు హోస్ట్ విషయమై కానీ, అలానే కంటెస్టెంట్స్ విషయమై కానీ బిగ్ బాస్ టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

నిజానికి ముందే అన్ని విషయాలు రివీల్ చేయడం బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధం కాబట్టి వారు గోప్యంగా ఇవన్నీ ఉంచినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున, అలానే పార్టిసిపెంట్స్ లిస్ట్ లో శ్రీముఖి, లాస్య వంటి వారి సందడి ఉంటె మాత్రం, ఈ షో చూసే ఆడియన్స్ కు కన్నులపండగే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వేచిచూడాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: