మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి గతంలో తీసిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల తరువాత రాబోతున్న ఈ సినిమాపై తెలుగు సహా అన్ని సినిమా ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే గత కొద్దిరోజుల క్రితం హీరోలు చరణ్, ఎన్టీఆర్ లకు చిన్నపాటి గాయాలవడంతో సినిమా షూటింగ్ ని కొన్నాళ్ళు వాయిదా వేయడం జరిగింది. 

ఇక వారి గాయాలు నయమవడంతో ఇటీవల మళ్ళి షూటింగ్ ని మొదలెట్టి, ప్రస్తుతం స్పీడ్ గా ముందుకు నడిపిస్తోంది సినిమా యూనిట్. ఇకపోతే మరొక్కసారి ఈ సినిమా షూటింగ్ కి మరొక పెద్ద బ్రేక్ పడననుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న అలియాభట్, మరోవైపు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటుండగా ఆమె అనారోగ్యం పాలవడంతో ఆ సినిమా షూటింగ్ రద్దయిందని, ఇక ఆమె ఆరోగ్యం బాగోని కారణం చేత, త్వరలో ప్లాన్ చేసిన ఆర్ఆర్ ఆర్ షూటింగ్ కి కూడా బ్రేక్ పెడ్డట్లే అని గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. 

అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, తమ సినిమా షూటింగ్ వాయిదాపడకుండా ఉండేలా రాజమౌళి టీమ్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అనారోగ్య కారణంగా అలియా షూటింగ్ లో పాల్గొనకలేకపోవడంతో ఆమె సీన్లు తీసే స్థానంలో ఇతర నటీనటులతో షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించారట. ఒకరకంగా ఈ విధంగా రాజమౌళి గారు ముందే జాగ్రత్తపడడం వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు పెద్దగా బ్రేక్ పడే అవకాశం లేదని, ఇక అలియా పూర్తిగా కోలుకున్న తరువాత ఆమె పై సీన్స్ తీయాలని నిర్ణయించడం జరిగిందట. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఎంతవరకు ముందుకు సాగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: