సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా ఇటీవల నటించిన 25వ సినిమా మహర్షి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తన సినిమా కెరీర్ లో చాలా ఏళ్ల  తరువాత అయన వరుసగా హిట్ వెంట హిట్ సాధించారు. ఇక మహర్షి మహేష్ బాబు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాక, కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ని సృష్టించింది. 

ఇకపోతే తన తదుపరి 26వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించిన సూపర్ స్టార్, ఇటీవల సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ ని నిర్ణయించిన ఆ సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక అతిత్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా అప్పుడే ఒక అద్భుత రికార్డు ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఛానల్ జెమినీ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజానికి మొదట ఆయా ఛానళ్ల మధ్య రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొందని, 

అయితే చివరికి ఎవరూ ఊహించని అత్యధిక ధరను కోట్ చేసిన జెమినీ సంస్థ, వాటిని దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఎంతధరకు పలికాయి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంతవరకు షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా, అప్పుడే రికార్డుల వేట మొదలెట్టిందంటే, ఇక షూటింగ్ పూర్తి చేసుకుని రేపు విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: