ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని దక్కించుకున్న సినిమా మహర్షి. ఇక మహేష్ బాబు కెరీర్ పరంగా అతి పెద్ద హిట్ గా నిలిచిన మహర్షి సినిమా, అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ అనే పేరును సంపాదించింది. ఇక ఇప్పటికే 40 రోజులు దాటిన ఈ సినిమా, ఇప్పటికీ కొన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

మరోవైపు నైజాం, గుంటూరు, కృష్ణ, మరియు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టిన మహర్షి, త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. అయితే తమ సినిమా 200 కేంద్రాల్లో 50 రోజులు పండుగ జరుపుకోనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కాసేపటి క్రితం ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అంతేకాక తమ మహర్షి సినిమా 50 రోజుల వేడుకను హైదరాబాద్, మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో అతిరథ మహారధులు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య ఎంతో వేడుకగా నిర్వహించనున్నట్లు ఆ ప్రకటన ద్వారా తెలిపింది. 

ఇక ఇప్పటికే ఈ సినిమా చాలా చోట్ల లాభాలు తెచ్చి పెట్టగా, సీడెడ్ మరియు ఓవర్సీస్ వంటి రెండు ప్రాంతాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది అంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికీ కూడా నైజాం ప్రాంతంలోని మల్టిప్లెక్స్ ల్లో మహర్షి వీక్ ఎండ్స్ లో తన హవాను కొనసాగిస్తూనే ఉందని కూడా అంటున్నారు విశ్లేషకులు. మరి చాలా రోజుల క్రితం రూ.100 కోట్ల మార్క్ షేర్ ని దాటేసిందని చెపుతున్న ఈ సినిమా, మొత్తం క్లోసింగ్ సమయానికి ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: