ఇండస్ట్రీలో ఉన్న చాలామంది తారలు తాము చేస్తున్న పాత్రలో నటించడం వల్ల ఒక్కోసారి నిజజీవితంలో కూడా అటువంటి పాత్రలు లోనే ఉండి పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఆ పాత్ర నుండి బయటపడలేక నానా తంటాలు పడుతుంటారు. తాజాగా ఇటువంటి అనుభవం హీరోయిన్ తాప్సీ కి ఎదురైందట.


ఇటీవల ఆమె ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆమె నటించిన  'మన్మర్జియా' అనే సినిమా గురించి చెప్పుకొచ్చింది. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమాలో తాప్సీ చాలా కోపంగా గంభీరం గా నటించింది. ఆ సినిమాలో తాప్సీ తనకు నచ్చని పని ఎవరైనా చేస్తే కచ్చితంగా కొట్టిపడేస్తుంది. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తాప్సి తన సోదరితో కలిసి బయటకి వెళ్లిందట.


ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రహస్యంగా తాప్సి ఫోటోలు తీశాడట. అది గమనించిన తాప్సి కోపంగా అతని వద్దకు వెళ్లి ఫోన్ లోపల పెడతావా..? లేక పగలగొట్టనా..? అని బెదిరించిందట. దీంతో ఆ ఫోటోలు తీసిన వ్యక్తి అక్కడ నుండి పారిపోయాడట. తాప్సి సోదరి మాత్రం భయపడి తనకు ఏమీ తెలియనట్లుగా ఉండిపోయిందట. ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పుకొచ్చింది తాప్సి.


మరింత సమాచారం తెలుసుకోండి: