బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఒకప్పుడు బాక్సాఫీస్ షేక్ చేసిన ఆయన ఇప్పుడు కనీసం తన సినిమా హిట్ అనిపించుకోడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన జీరో సినిమా కూడా నిరాశపరచడంతో షారుఖ్ మరింత డీలా పడ్డాడు.


అయితే ప్రస్తుతం ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా తాను చేయనని చెప్పాడట షారుఖ్. హిట్టు సినిమా కథ కోసం వేట మొదలు పెట్టాడట షారుఖ్ ఖాన్. అయినా తాము చేసే సినిమా హిట్టా ఫట్టా అన్నది రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చేదాకా తెలియదు అలాంటిది షారుఖ్ ఎలా హిట్టు కథ కోసం వెతుకుతున్నాడు అంటే ఇంతవరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట.


జీరో సినిమా కచ్చితంగా హిట్టు కొడుతుందని అనుకోగా అది కూడా నిరాశపరచింది. అందుకే తొందరపడకుండా కథ పకడ్బందీగా అనుకున్నాకే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ఏ సినిమాకు సైన్ చేయలేదని కొంత గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు షారుఖ్.      


అంతేకాదు షారుఖ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడన్న వార్తలు కూడా ఈమధ్య సందడి చేశాయి. ఒకప్పుడు బాలీవుడ్ బాద్షాగా క్రేజ్ తెచ్చుకున్న షారుఖ్ ఇలా హిట్టు కోసం తపించిపోవడం చూసి పాపం అనేస్తున్నారు బాలీవుడ్ జనాలు. సినిమాలు హిట్టు కాకున్నా షారుఖ్ వాణిజ్య ప్రకటనల్లో మాత్రం దూసుకెళ్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: