మిల్కీ బ్యూటీ తమన్నాకి పెద్ద కష్టమే వచ్చి పడ్డది. దశాబ్ధ కాలంగా కెరియర్ సాగిస్తున్న అమ్మడు ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల పాత్ర గురించి ఓ నెగటివ్ టాక్ బయటకు వచ్చింది. ఆ టాక్ పై తమన్నా బెంబేలెత్తిపోతుంది. ఇంతకీ తమన్నా అంత కంగారు పడాల్సిన అవసరం ఏంటి అంటే.. స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా కెరియర్ అటకెక్కినట్టు కనిపించినా ఈమధ్య మళ్లీ పుంజుకుంది.


ఎఫ్-2 హిట్ తో జోష్ పెంచిన తమన్నా బాలీవుడ్ లో కామోషి, అభినేత్రి 2 సినిమాలు ఫ్లాప్ అయినా తమన్నాపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాజు గారి గది 3 సినిమాలో నటిస్తున్న అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. చిరు సైరాలో తమన్నాని ఇంపార్టెంట్ పాత్ర అని తెలుస్తుంది.    


అయితే కొన్ని మీడియా ఛానెల్స్ సైరాలో తమన్నాది నెగటివ్ రోల్ అంటూ వార్తలు రాస్తున్నారు. వాటిపై తమన్నా బాగా సీరియస్ అవుతుంది. సినిమాలో తన క్యారక్టర్ అది కాదని చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటుంది మిల్కీ బ్యూటీ. తన పాత్ర మీద మీడియా కావాలని నెగటివ్ ప్రచారం చేస్తుందని.. అసలు ఏమాత్రం తెలియకుండా అలా ఎలా రాస్తారంటూ సీరియస్ అవుతుంది తమన్నా. 


ఓంకార్ చేస్తున్న రాజు గారి గది 3లో కూడా తమన్నా నటిస్తుంది. ఈమధ్య స్టార్ హీరోయిన్స్ అంతా ఫీమేల్ లీడ్ సినిమాలను చేస్తున్నారు. ఆల్రెడీ సమంత అదే తరహా సినిమాలు చేస్తుంటే కాజల్ కూడా సీత అంటూ ఆ ప్రయత్నం మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు తమన్నా కూడా అలాంటి సినిమాలకే మొదట ప్రిఫరెన్స్ ఇస్తుంది. మరి తమన్నా పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఛాన్సులు పట్టేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇదే ఫాం ను మరికొద్ది రోజులు కొనసాగించాలని ఆశిద్దాం.   



మరింత సమాచారం తెలుసుకోండి: