ఇటీవల టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు సినిమా మ్యానేజర్లు మరియు కోఆర్డినేటర్లు అమ్మాయిలను అవకాశాల పేరుతో లొంగతీసుకోవడం, అలానే మరికొందరిని లైంగికంగా ఇబ్బందులకు గురించేయడం వంటివి చేస్తున్నారు అంటూ వర్ధమాన నటి శ్రీరెడ్డి, మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన విషయం ఎంత పెద్ద సంచలనం అయిందో అందరికి తెలిసిందే. ఇక ఆ తరువాత ఆమెకు మా అసోసియేషన్ నుండి తీసేయడం, 

మళ్ళి కొద్దిరోజులకు తీసుకోవడం వంటి నాటకీయ పరిణామాలు నడిచాయి. అయితే అక్కడినుండి శ్రీరెడ్డి అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది అనే చెప్పాలి. అయితే అంతటితో ఆగని శ్రీరెడ్డి, అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ప్రోద్బలంతో హీరో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాక్యలు చేసి, అయన అభిమానుల ఆగ్రహానికి గురికావడం జరిగింది. ఇక ఇటీవల కొన్నాళ్ల క్రితం తన  మకాం చెన్నై కి మార్చిన శ్రీరెడ్డి, ఇప్పటికీ అప్పుడపుడు తనదైన శైలిలో సినిమా నటులపై సెటైరికల్ గా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు చేస్తూనే ఉంది. 

ఇకపోతే నిన్న శ్రీరెడ్డి, తన కళ్ళను రకరకాల రంగుల్లో మారుస్తూ, కళ్ళతో చంపేస్తా అంటూ ఒక తమిళ సాంగ్ ని టిక్ టాక్ వీడియోగా చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో చూసినవారు శ్రీరెడ్డి కళ్ళకు ఏమైనా అయిందా ఏంటి అనుకున్నారు. అయితే నిశితంగా పరిశీలిస్తే అది టిక్ టాక్ వీడియో అని, అందువల్లనే ఆమె కళ్ళు ఆ విధంగా రకరకాలుగా కనపడుతున్నాయని అర్ధం అవుతుంది. ఇక శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: