టాలీవుడ్ లో అటు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోక సగటు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది రెజినా. తెలుగు, తమిళ భాషల్లో తన ముద్ర వేయాలని చూసిన అమ్మడు రెండేళ్ల క్రితం వరకు కెరియర్ బాగానే సాగించినా ఈమధ్య పూర్తిగా ట్రాక్ తప్పేసింది. ప్రస్తుతం వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్న రెజినా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పోర్న్ సైట్స్ చూస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.


సాధారణంగా అవి చూసినా వాటి గురించి మాట్లాడేందుకు పెద్దగా ఎవరు ఇష్టపడరు.. కాని రెజినా మాత్రం పోర్న్ సైట్స్ చూస్తానని డైరెక్ట్ గా ఒప్పుకుంది. అంతేకాదు ఈరోజుల్లో అందంతా కామన్ అంటూ అందరిని ఆశ్చర్యపరచింది. ఇక తన ఫస్ట్ క్రష్ ఐదోతరగతిలో అయ్యిందని ఆ తర్వాత యూఎస్ వెళ్లడంతో అంతా మారిపోయిందని చెప్పింది.   


తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా రెజినా అలాంటి టైంలో యువ హీరోలతో జతకట్టి కెరియర్ పాడుచేసుకుంది. రకుల్ తో పాటుగా ఒకేసారి కెరియర్ మొదలు పెట్టిన అమ్మడు ఆమె స్టార్స్ తో సినిమా చేస్తుంటే రెజినా మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పేసింది. మరి రానున్న రోజుల్లో అయినా రెజినా మళ్లీ మెయిన్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.


రీసెంట్ గా రిలీజైన 7 సినిమాలో నెగటివ్ రోల్ లో సర్ ప్రైజ్ ఇచ్చిన రెజినా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే సరైన హిట్ కొట్టలేకపోతుంది. ఇప్పటికి మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రెజినాకు మెగా హీరో సాయి ధరం తేజ్ తన సినిమాలో అవకాశం ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సాయి ధరం తేజ్ తో స్నేహంపై కూడా మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఇద్దరు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని గట్టిగానే చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: