త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్-సమంత జంటగా అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా అ..ఆ. ఈ సినిమాలో సాంగ్ లోని పదాన్ని ఇప్పుడు నితిన్ సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేశారు. సాధారణంగా ఇలా పల్లవి, చరణాల్లోని పదాలను చాలా సినిమాలకు టైటిల్‌గా ఫిక్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు నితిన్ సినిమా కి ఫిక్స్ చేసిన టైటిల్ మాత్రం కాస్త క్రేజీగా ట్రెండీగా ఉండటం ఆసక్తికరంగా మారింది. వరుసగా ఫ్లాప్ లతో దాదాపు 10 నెలలు ఖాలీగా ఉన్న యంగ్ హీరో నితిన్ ఒక్కసారిగా ఫుల్ పామ్ లోకి వచ్చేసాడు. ఒక సినిమా స్టార్ట్ చేసాడు. మరో సినిమా ఓపెన్ చేసాడు. ఇంకో సినిమాకు ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేశాడు. 


వెంకీ కుడుమల-రష్మిక మడొన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూట్ ను సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా కంటిన్యూ షెడ్యూల్ తో బిజి బిజీగా ఉన్నారు. ఇక భవ్య బ్యానర్ పై రకుల్ ప్రీత్ సింగ్-ప్రియా వారియర్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో సినిమాకు ముహుర్తం చేసేసాడు. 
త్వరలో ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ అట్లూరి-సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబినేషన్ లో మరో సినిమా వుందన్న సంగతి తెలిసిందే. 


ఈ సినిమాకు టైటిల్ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. రంగ్ దే అన్నది టైటిల్. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారో అందరికీ తెలిసిందే. నితిన్ బ్లాక్ బస్టర్ హిట్ అ..ఆ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రంగ దే..రంగ్ దే..ఇప్పుడు అదే నితిన్ -వెంకీ అట్లూరి సినిమాకు టైటిల్ అయింది.  మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ప్రకటించి నితిన్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు. మరీ వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా కమర్షియల్ సక్సస్ ను అందుకొని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: