అమెరికాలోని తెలుగువారి సంస్థ తానా. ప్రతీ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే తానా సభలకు సినిమా, రాజకీయ, సామాజిక ప్రముఖులు పలువురికి ఆహ్వానాలు అందుతుంటాయి. కొంతమంది రావడం సభలకు స్పెషల్ అట్రాక్షన్ గా వుంటుందని, కొంతమంది రావడం గౌరవంగా వుంటుందని, కొంతమందిని గౌరవించడం ఎంతో అవసరం అని.. ఇలా రకరకాల ఈక్వేషన్లు, లాజిక్‌లు, కారణాలు ఈ ఆహ్వానాల వెనుక వుంటాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సెలబ్రిటీస్ కి సంబంధించి ఇంకా క్లారిటీ లేదని మాత్రం అర్థమవుతోంది.


ఈసారి తానా సభలకు క్రేజీ సెలబ్రిటీలు మరీ ఎక్కువగా లేరన్న విషయం తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ అని ఇప్పటివరకు అందిన సమాచారం. అల్లరి నరేష్, నారారోహిత్, సునీల్ లాంటి హీరోల పేర్లు మాత్రమే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మహిళా సినిమా సెలబ్రిటీలు మరీ తక్కువ అని కూడా తెలుస్తోంది. కమిలినీ ముఖర్జీ లాంటి మాజీ హీరోయన్ మాత్రమే వస్తున్నారట. గాయని సునీత, యాంకర్ సుమ కూడా ఈ జాబితాలో వున్నారు. వీరిలో సుమ ఒక్కరే ఫుల్ బిజీగా వున్న సెలబ్రిటీ. టోటల్ జాబితాలో ఎవరు ఇప్పుడు క్రేజీగా వున్నారో అన్నది జనాలకు తెలిసిందే. టాప్ సెలబ్రిటీల పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపించడం లేదు.


ఇక ప్రస్తుతం యంగ్ హీరోల్లో ఫుల్ క్రేజ్ వున్న విజయ్ దేవరకొండను ఎలాగైనా తానా సభలకు రప్పించాలని నిర్వాహకులు గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ విజయ్ సానుకూలంగా స్పందించలేదని ఇంటర్నల్ టాక్. తనకు వ్యక్తిగత, ఫ్యామిలీ పనులు వున్నాయని, రాలేనని చెప్పినట్లు ఫ్రెష్ అప్‌డేట్. ఇక రాజకీయంగా సిఎమ్ రమేష్, టిజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆహ్వనితుల జాబితాలో వున్నారట. మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు హాజరవుతారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: