ఇండస్ట్రీలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. అతి కొద్ది కాలంలోనే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళలో పూరీ తర్వాతే. అంత క్రేజ్, అంత పాపులారిటి తెచ్చుకున్న పూరీ గారికి కొంతకాలంగా హిట్ పడటంలేదు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో, హీరోయిన్లు కాస్త బోల్డ్ గా వుంటారు. హీరోలు రఫ్ గా వుంటే, హీరోయిన్లు బోల్డ్ గా మాట్లాడేస్తారు. వచ్చే నెలలో రాబోతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. వీళ్లలో ఓ హీరోయిన్ ఓ రేంజ్ బోల్డ్ నెస్ తో కనిపిస్తుందని లేటెస్ట్ న్యూస్.


ఆ హీరోయిన్ ఇస్మార్ట్ శంకర్ లో కంప్లీట్‌గా తెలంగాణ స్లాంగ్ లో రెచ్చిపోతుందని టాక్. ఆ రెచ్చిపోవడంలో కూడా తిట్లు, బూతుల్లాంటి తిట్లు ఓ రేంజ్ లో వుంటాయని టాక్. అవి ఏ రేంజ్ లో వుంటాయి అంటే సెన్సారు ఓకె చేస్తే సరే కానీ, లేదూ అంటే బీప్ లు ఎక్కువ వినిపిస్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలాంటి మాస్ సినిమాలు అంటే బి సి సెంటర్లలో జనాలకు భలే హుషారుగా వుంటుంది. అమ్మాయిలు రెచ్చిపోతుంటే చూడడం, అబ్బాయిలు వీర ఆటిట్యూడ్ తో వుంటే థియేటర్ రావడం వంటి మాస్ ప్రేక్షకుల సంగతి పూరికి బాగా తెలుసు కనుకే ఆయన సినిమాల్లో పాత్రలు అలా వుంటాయి. 


గతంలో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలలో మనందరికి అంటే ప్రస్తుతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న అమ్మాయిలకు కూడా బాగా నచ్చే బూతులున్న సంగతి తెలిసిందే. కొంతమంది అమ్మాయిలు మీడీయా సమక్షంలో 'ఆ...' డైలాగ్స్ మేము బాగా ఎంజాయ్ చేశామని కూడా చెప్పారు. ఈ విషయం పూరీ కూడా ఒప్పుకున్నారు. అందుకనే ఈ సారి ఈ డోస్ ను మరికాస్త పెంచినట్లు రీసెంట్‌గా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ టీజర్ చూస్తే అర్థమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: