మెగా హీరో వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబందించిన ప్రీ టీజర్ రిలీజైంది. సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తుండటం విశేషం.


తమిళంలో ఈ పాత్రను బాబి సింహా చేశాడు. కోలీవుడ్ లో సిద్ధార్థ్ నటించిన ఈ పాత్రకు తమిళ యువ హీరో అధర్వను సెలెక్ట్ చేశారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించాడు. సినిమా ప్రీ లుక్ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఇక ఫస్ట్ లుక్ టీజర్ లో వరుణ్ తేజ్ మెస్మరైజ్ చేశాడు.


మెగా హీరోల్లో ప్రతి సినిమా కొత్తగా ప్రయత్నిస్తున్న వరుణ్ తేజ్ వాల్మీకి టీజర్ లో నెగటివ్ లుక్ లో అదరగొట్టాడు. ఇలాంటి రిస్కీ పాత్రను ఎంచుకున్నందుకు మెగా ఫ్యాన్స్ అంతా వరుణ్ తేజ్ ను మెచ్చుకుంటున్నారు. ముకుందా నుండి ఎఫ్-2 వరకు కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న వరుణ్ తేజ్ వాల్మీకితో మరో మైల్ స్టోన్ అందుకుంటాడనిపిస్తుంది.  


జస్ట్ ప్రీ లుక్ టీజర్ చూస్తేనే ఇలా ఉంది అంటే ఇక సినిమాలో వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించి ఉంటాడని చెప్పొచ్చు. దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న ఈ సినిమాపై హోప్స్ బాగానే ఉన్నాయి. మెగా హీరోలకు ఎప్పుడు హిట్ ఇస్తున్న హరీష్ శంకర్ తప్పకుండా వరుణ్ తేజ్ కు వాల్మీకితో మరో సూపర్ హిట్ ఇస్తాడని అటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: