బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఇప్పుడు అక్కడ టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్నది.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  ప్రస్తుతం ఆమె చేస్తున్న పెద్ద సినిమా సాహో.  ఈ సినిమా షూటింగ్ యూరప్ దేశాల్లో స్పీడ్ గా జరుగుతున్నది.  చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

శ్రద్దా కపూర్, ప్రభాస్ కు సంబంధించిన కీలక దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.  ఫస్ట్ టైం శ్రద్దా కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.  ఇదిలా ఉంటె, శ్రద్దా కపూర్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  త్రిబుల్ మిర్రర్ ముందు కూర్చొని ఉన్న ఫోటో అది.  ఫ్రంట్ లో ఉన్న మిర్రర్ లో శ్రద్దా కపూర్ పేస్ కనిపిస్తోంది.  సేడ్ మిర్రర్ లో ఆమె హెయిర్ స్టయిల్ కు సంబంధించిన ఫోటో కనిపిస్తోంది.  


గ్లాస్ హౌస్ లో నుంచి ఎదురుగా మంచు పర్వతాలు.  అద్భుతంగా ఉన్నది ఫోటో.  ఈ ఫొటోకు శ్రద్దా క్యాప్షన్ ఇచ్చింది.  అప్ అబో ది వరల్డ్ సో హై అనే క్యాప్షన్.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  


శ్రద్దా హీరోయిన్ గా చేస్తున్న సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో తీసిన ఈ మూవీ ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో రిలీజ్ సమయాన్ని ప్రకటిస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: