రాజకీయాల్లోకి వస్తే అంతే. ఓ పార్టీని అభిమానించి మరో పార్టీని విమర్శిస్తే అసలే ఆ సామాజికవర్గం అధికంగా ఉన్న టాలీవుడ్లో చాన్సులు వస్తాయా. మరి పోసాని క్రిష్ణ మురళి లాంటి వారికే ఈ పరిస్థితి ఎదురైతే.  చాలా మందికీ తట్టుకోవడం కష్టమే మరి.



అవును నిజమే అన్నారు క్రిష్ణ మురళి ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. తాను జగన్ కి మద్దతు ఇచ్చానని చెప్పి చాలా మంది నన్ను వ్యతిరేకించారు. నా పేరు రాసి మరీ లిస్ట్ లో లేకుండా చేశారు. నన్ను ఒంటరి వాణ్ణి చేయాలని చూశారు. అయినా నేను జగన్ అభిమానిని. అందువల్ల ఎక్కడా దాచుకోను అన్నారు క్రిష్ణ మురళి.


ఒక బడా నిర్మాత అంటూ అశ్వనీదత్ పేరు చెప్పిన క్రిష్ణ మురళి తన సినిమాలో పాత్ర ఇవ్వకుండా చేశారని, వైసీపీకి మద్దతు ఇవ్వడమే ఇందుకు కారణమని క్రిష్ణ మురళి చెప్పుకొచ్చారు. అయినా తాను ఇలాంటివి పట్టించుకోను, భయపడను అంటున్నారు ఆయన.


మరింత సమాచారం తెలుసుకోండి: