మహర్షి సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాకుండా  మహేష్ కెరీర్లోనే హయ్యస్ట్ ఎర్నింగ్ మూవీగా నిలిచింది.  దాదాపు 105 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. రిలీజ్ అయ్యి 50 రోజులైనా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గలేదు.  అదే స్పీడ్ తో కలెక్షన్లను వస్తున్నాయి.  


దాదాపు 200 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.  ఇప్పట్లో 50 రోజులు ఆడటం అంటే గ్రేట్ అనే చెప్పాలి.  నాలుగు వారాలు ఆడితే చాలు అనుకుంటున్నారు.  50 రోజుల పండుగలు జరుగుతున్నాయి కానీ, 100 రోజుల పండుగలు చాలా అరుదుగా జరుగుతుండటం విశేషం. 


ప్రస్తుతం మహేష్ 26 వ సినిమా ప్రారంభం అయ్యింది.  ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నది.  సినిమా ఇంకా షూటింగ్ కాకముందే ఈ సినిమాకు చెందిన శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి సంస్థ సొంతం చేసుకున్నట్టు సమాచారం.  


సరిలేరు నీకెవ్వరూ సినిమాను 16.5 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు.  మహర్షి కంటే ఇది నాలుగు కోట్ల రూపాయలు అధికం అని చెప్పాలి.  మహర్షి సినిమా శాటిలైట్ రైట్స్ 12 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: