సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా సంచలన విజయం అందుకుని మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్ కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.  


అయితే ఎన్నో వందల సినిమాలకు రైటర్ గా పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ మహర్షి సినిమాను విశ్లేషిస్తూ అందులో కొన్ని తప్పులున్నాయని వేలెత్తి చూపించారు. మహర్షి సినిమాలో తప్పులా అని షాక్ అవ్వొచ్చు అవును కొన్ని దిద్దుబాట్లు ఉంటే బాగుండేది అన్నది పరుచూరి వారి ఆలోచన.  


ముందుగా ఈ సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. సినిమా లెంగ్త్ కట్ చేయాల్సింది. సీన్స్ కట్ చేయడం కుదరకపోతే ఫ్రేమ్స్ అయినా ట్రిం చేయాల్సింది అన్నారు. ఇంద్ర సినిమా టైం లో ఇలానే నిడివి సమస్య వస్తే ఫ్రేంస్ కట్ చేస్తే 10 నిమిషాల పాటు తగ్గిందని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో హీరో తన స్నేహితుడి కోసం పల్లెటూరికి రావడం చెట్టు కింద సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టడం. అక్కడకే హెలికాఫ్టర్లు రావడం అనేది కాస్త అసహజత్వంగా ఉంది. 


ఇక స్నేహితుడి వల్ల కాపాడబడ్డ హీరో ఆ విషయం తెలుసుకుని అతని కోసం రావడంలో చాలా ఆలస్యం అయ్యింది. ఆ విషయం చెప్పడానికి దర్శకుడు ముక్కు ఎక్కడా అంటే తల చుట్టూ తిప్పి చూపించాడనిపిస్తుంది. ఫ్రెండ్ పాత్రలో కూడా లోపం కనిపిస్తుంది. హీరో ఆఫీస్ చెట్టు కింద కాకుండా స్నేహితుడి ఇంట్లో పెట్టుకుంటే బాగుండేదని అన్నారు పరుచూరి. మొత్తానికి ఇలా తన మార్క్ విశ్లేషణతో మహర్షిలోని తప్పులను చెప్పారు పరుచూరి గోపాల కృష్ణ. అయితే సినిమా జనాలకు నచ్చి హిట్ అయ్యింది కాబట్టి పరుచూరి చెప్పిన ఈ తప్పులేవి ప్రేక్షకులకు అంతగా రుచించవని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: