రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హుషారైన అమ్మాయి. అందం, అణకువతో పాటు.. అల్లరి తెలిసిన పిల్ల. ‘టామ్‌ బోయ్‌’ ట్యాగ్‌ ఆమెకు అతికినట్టు సరిపోతుంది. ఈ విషయాన్ని తనే చెప్పింది. ‘‘టామ్‌ బోయ్‌ అనిపిలిపించుకోవడం నాకు ఇష్టం. నేను కూడా అలానే ఉంటాను. స్నేహితులతోనో, ఇంట్లోనో ఉన్నప్పుడు అసలు నేనేంటో అర్థం అవుతుంది. కుదురుగా ఓ చోట కూర్చోను.

 

అందుకే చాలాసార్లు దెబ్బలు తగులుతుంటాయి. అలా దెబ్బలు తినడం నా జీవితంలో భాగం అయిపోయింది. ఏదైనా ఓరోజు నాకేం జరక్కపోతే.. ‘ఏంటి? ఈరోజు చిన్న దెబ్బ అయినా తగల్లేదు’ అని ఆలోచిస్తుంటా. ఇది వరకు నా తీరు చూసి ఇంట్లోవాళ్లు కంగారు పడేవాళ్లు. ఆ తరవాత వాళ్లకీ అలవాటైపోయింది.

 

ఇంట్లో నడుస్తూ  నడుస్తూనే కింద పడిపోతుంటాను. నా మనసు ఒకలా, శరీరం మరోలా ఆలోచిస్తున్నప్పుడే ఇలా జరుగుతుందేమో. సెట్లో, జిమ్‌ చేసేటప్పుడు మాత్రం నా దృష్టంతా వాటిపైనే ఉంటుంది. అప్పుడు నాలోని సిన్సియారిటీని చూస్తారు.’’  నాకు ఎక్సరసైజ్ అంటే మహా ఇష్టం. అది లేకుండా ఉండలేను అని చెప్పింది రకుల్‌.

 

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని మహారాణిలా వెలుగుతోంది మన రకుల్ ప్రీత్ సింగ్.  ఈమె సినిమాలలో ఆమెకు పేరు తెచ్చినవి, 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'రారండోయ్ వేడుక చూద్దాం'... ఈ సినిమాలు ఆమెకు మంచి పేరు, ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. హైదరాబాద్ సిటీలో కొన్ని చోట్ల జిమ్ములు ఓపెన్ చేసింది, వ్యాపారంలో కూడా మంచి పట్టుంది అమ్మడుకి.


మరింత సమాచారం తెలుసుకోండి: