ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. అంతకముందు పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్, ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ, అర్జున్ రెడ్డి సక్సెస్ తో అతడు ఒక్కసారిగా టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అనే చెప్పాలి. ఇకపోతే ఆ సినిమా అంతపెద్ద హిట్ అవడానికి విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ తో పాటు సినిమాను ఎంతో సహజంగా తెరకెక్కించిన సందీప్ రెడ్డికి కూడా క్రెడిట్ వెళుతుంది. 

ఇక ఈ సినిమా విడుదలై హిట్ కొట్టిన తరువాత, దీని రైట్స్ కోసం తమిళ్, హిందీ పరిశ్రమల నుండి మంచి ఆఫర్స్ రావడం జరిగింది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్, కబీర్ సింగ్ పేరుతో మొన్న విడుదలై మంచి హిట్ దిశగా సాగుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జోడికట్టిన ఈ హిందీ వెర్షన్ కి కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించడం జరిగింది. ఇక విడుదల రోజునుండి సినిమాకు మంచి టాక్ రావడం, అలానే మెల్లగా కలెక్షన్లు కూడా ఊపందుకోవడం జరిగింది .ఇక ప్రస్తుతం ఈ సినిమా మంచి హిట్ సినిమాగా ప్రేక్షకాదరణ పొందుతుండడంతో బాలీవుడ్ కళ్ళు సందీప్ రెడ్డి పై పడ్డాయి. నిజానికి అప్పుడెప్పుడో తెలుగు నుండి అక్కడికి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ, అక్కడి బడా స్టార్స్ తో సినిమాలు తీసి మంచి హిట్స్ అందుకున్నారు. 

ఇక ఆ తరువాత ఇటీవల బాహుబలి సిరీస్ సినిమాలతో రాజమౌళి, ఆ చిత్రాల డబ్బింగ్ వర్షన్ ద్వారానే అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొంది మంచి పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి కూడా వారి సరసన చేరాడు. ఇక కబీర్ సింగ్ విడుదల తరువాత, ఎవరీ సందీప్, ఇతర పుట్టుపూర్వోత్రాలు ఏంటి అంటూ బాలీవుడ్ కి చెందిన పలువురు వెతకడం మొదలెట్టారట. అంతేకాక అప్పుడే అతడికి అక్కడి నిర్మాతలనుండి మంచి ఆఫర్లు కూడా రావడం మొదలైనట్లు సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: