Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:05 am IST

Menu &Sections

Search

వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!

వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
వర్మ, రాజమౌళి తరువాత ఆ ఘనత అతనికే దక్కింది...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. అంతకముందు పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్, ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ, అర్జున్ రెడ్డి సక్సెస్ తో అతడు ఒక్కసారిగా టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అనే చెప్పాలి. ఇకపోతే ఆ సినిమా అంతపెద్ద హిట్ అవడానికి విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ తో పాటు సినిమాను ఎంతో సహజంగా తెరకెక్కించిన సందీప్ రెడ్డికి కూడా క్రెడిట్ వెళుతుంది. 

ఇక ఈ సినిమా విడుదలై హిట్ కొట్టిన తరువాత, దీని రైట్స్ కోసం తమిళ్, హిందీ పరిశ్రమల నుండి మంచి ఆఫర్స్ రావడం జరిగింది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్, కబీర్ సింగ్ పేరుతో మొన్న విడుదలై మంచి హిట్ దిశగా సాగుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జోడికట్టిన ఈ హిందీ వెర్షన్ కి కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించడం జరిగింది. ఇక విడుదల రోజునుండి సినిమాకు మంచి టాక్ రావడం, అలానే మెల్లగా కలెక్షన్లు కూడా ఊపందుకోవడం జరిగింది .ఇక ప్రస్తుతం ఈ సినిమా మంచి హిట్ సినిమాగా ప్రేక్షకాదరణ పొందుతుండడంతో బాలీవుడ్ కళ్ళు సందీప్ రెడ్డి పై పడ్డాయి. నిజానికి అప్పుడెప్పుడో తెలుగు నుండి అక్కడికి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ, అక్కడి బడా స్టార్స్ తో సినిమాలు తీసి మంచి హిట్స్ అందుకున్నారు. 

ఇక ఆ తరువాత ఇటీవల బాహుబలి సిరీస్ సినిమాలతో రాజమౌళి, ఆ చిత్రాల డబ్బింగ్ వర్షన్ ద్వారానే అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొంది మంచి పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి కూడా వారి సరసన చేరాడు. ఇక కబీర్ సింగ్ విడుదల తరువాత, ఎవరీ సందీప్, ఇతర పుట్టుపూర్వోత్రాలు ఏంటి అంటూ బాలీవుడ్ కి చెందిన పలువురు వెతకడం మొదలెట్టారట. అంతేకాక అప్పుడే అతడికి అక్కడి నిర్మాతలనుండి మంచి ఆఫర్లు కూడా రావడం మొదలైనట్లు సమాచారం.....!!


sandeep-reddy-vanga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోయిన్ కి ఇలియానా 2.0 బిరుదు ఇచ్చేసారుగా.....!!
బాబోయ్ 3 రోజుల్లో రూ.36 కోట్ల కలెక్షనా...??
ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!
బిగ్ బాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాకింగ్.....??
అది శ్రీరెడ్డికి పెద్ద షాకే మరి.....!!
ఈసారి మహేష్ తో వంశీ పైడిపల్లి అటువంటి సినిమా చేస్తున్నాడా.....??
థియేటర్లో ఆ సీన్స్ కు మెగా ఫ్యాన్స్ కు పూనకాలేనట.....!!
టాలీవుడ్ హీరోల నెంబర్ గేమ్ లో విజేత ఎవరంటే.....??
'జనగణమణ' మూవీ కి రౌడీ హీరోని లాక్ చేసిన పూరి.....??
'ఎవరు'తో 'రణరంగం'లో ఎవరిది విజయం.....??
ప్రభాస్ తో పోటీ పై ఏమాత్రం తగ్గేది లేదట.....!
పార్టీలో మందు బాటిల్ తో రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.....!!
సిమ్రాన్, ఇలియానా తరువాత ఆమేనట......!!
సితార, మహేష్ ను మించిపోతోందా.....??
బాహుబలికి కాపీ అంటున్నారు.....!!
ఇస్మార్ట్ కు పెద్ద దెబ్బేసారుగా......!!
మొదటి షెడ్యూల్ ఎంతో ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశారట......!!
బాబోయ్ శృతి హాసన్ అంటూ భయపడుతున్నారు......!!
అప్పుడలా, ఇప్పుడిలా....ఇలా అయితే ఎలా పూరి....!!
ఆ విషయంలో 'సూపర్ స్టార్ మహేష్' క్రేజ్ ని ఎవరు టచ్ కూడా చేయలేరు......!!
శ్రీముఖి గురించిన ఆ వార్త నిజమేనట......!!
జగపతి బాబు తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చేసారు.....!!
మాస్ లో దూసుకెళ్తోంది.....!
'సాహో' ఇలా అయితే కష్టమే......!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.