రోజురోజుకి టాలీవుడ్ ఫిలిం ఎంట్రీ ఇస్తున్న హీరోల సంఖ్య పెరిగిపోతున్న   పరిస్థుతులలో ట్యాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న నిఖిల్  విషయంలో  అసలేం జరుగుతోంది ?  అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిఖిల్ నటించిన సినిమా రిలీజై ఇప్పటికే చాలా కాలమైంది. దీనితో అతడి అభిమానులు అతడు నటించిన లేటెస్ట్ మూవీ   ‘అర్జున్ సురవరం’ గురించి ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈమూవీ రకరకాల కారణాలతో ఈ సినిమాని వాయిదా వేశారు. జూన్ లేదా జూలైలో రిలీజవుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ టైంలో కూడ ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు అని అంటున్నారు. మరోవైపు నిఖిల్ నటించే మరో సినిమా `శ్వాస` పరిస్థితి ఏమిటి అన్న చర్చలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి.

ఈ చిత్రానికి కిషన్ కట్టా అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  అయితే హీరో నిఖిల్ కు దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని దీనితో ఈ మూవీ కధలో మార్పు చేర్పుల కోసం ప్రయత్నిస్తున్నపరిస్థితులలో ఈమూవీ ఇప్పట్లో షూటింగ్ వైపు వెళ్ళకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. 
 
ఇది చాలదు అన్నట్లుగా మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ని ప్రకటించినా ఆ మూవీ రెగ్యులర్ చిత్రీకరణకు సంబంధించిన క్లారిటీ కూడ రావడంలేదు. ఇప్పటికే యంగ్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతున్న నేపధ్యంలో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ ‘శ్వాస’ ‘కార్తికేయ 2’ మూవీ ప్రాజెక్ట్స్ పై సరైన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే రాన్నున్న రోజులలో ఈయంగ్ హీరో చాలా నష్టపోయే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ హడావడి చేస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: