మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా బ్రదర్ వరుణ్ తేజ్.  మొదటి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ముకుంద’ పెద్దగా పేరు తీసుకు రాకపోయినా రెండో మూవీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ఏకంగా జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా చేసింది.  ఆ దెబ్బతో వరుణ్ తేజ్ కి మంచి పేరు వచ్చింది.  నటుడిగా మాస్ ఎలిమెంట్స్ తో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ మూవీ హిట్ కాకపోయినా వరుణ్ తేజ్ ని మాత్రం మాస్ హీరోగా నిలిపింది.  ఆ తర్వాత వచ్చి ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్ అయ్యాయి. 


ఈ సంవత్సరం వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా  హరీష్‌ శంకర్  దర్శకత్వంలో ‘వాల్మీకి’సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.  సాధారణంగా హరీష్ శంకర్ సినిమా అంటే మాస్ ఎంట్రటైన్ తో పాటు హీరోని బాగా ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది.  ఈ మూవీలో వరుణ్ తేజ్ నెగిటీవ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట. మంచి ఫామ్ లో ఉన్న హీరో ఇలాంటి ప్రయోగాలు చేయడం నిజంగా వరుణ్ తేజ్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.  ఆ మద్య పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘టెంపర్ ’ సినిమాలో ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించారు. 


మరి వాల్మీకితో వరుణ్ తేజ్ ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ అదరగొట్టబోతున్నాడో చూడాలి.  వరుణ్ తేజ్ సరసన అందాల భామ పూజాహెగ్డే నటిస్తుంది.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యింది.  మొత్తానికి వ‌రుణ్ పూర్తిగా మాస్ లుక్ లో క‌నిపించాడు.. ఈ మూవీకి సంగీతం – దేవీ శ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ – అయనంకా బోస్‌, కథ – కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ ప్లే – మధు, చైతన్య, ఆర్ట్‌ – అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌ – ఛోటా కె ప్రసాద్‌, ఫైట్స్‌ – రామ్‌ లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – హరీష్‌ కట్టా, మాటలు, దర్శకత్వం – హరీష్‌ శంకర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: