రైటర్ కమ్ డైరక్టర్ కమ్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి ఎదుట ఎవరు ఉన్నా ఆయన ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే చాలా తక్కువమందిలో పోసాని ఒకరు. సినిమాల్లోనే కాదు రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు పోసాని. ఈసారి జగనే సిఎం అవుతాడని ముందునుండి చెబుతూ వచ్చిన పోసాని జగన్ సిఎం కావాలన్న కోరిక నెరవేరిందని అన్నారు.    


ఇక ఈమధ్య అనారోగ్యానికి గురైన పోసాని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని చెప్పారు. ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ తన సినిమాలో పోసాని వద్దని దర్శకుడితో చెప్పారని ఆయన అన్నారు. ఇదిలాఉంటే టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్.టి.ఆర్ చేతికి వస్తే ఎలా ఉంటుంది.. దీనిపై మీ స్పందన ఏంటని పోసానిని అడిగారు.  


జూనియర్ ఎన్.టి.ఆర్ రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేడని అన్నారు. ఎన్.టి.ఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చినా ఇక్కడ బండి నదవదని అన్నారు పోసాని. ఐ కెన్ బ్రింగ్ స్టార్ ఫ్రం ద స్కై అని హీరో చెప్పినా నమ్మే రోజులు లేవని అన్నారు. హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది కాని తెలివితేటలు పెరగవు.. ప్రజా సేవ దృక్పథం పెరగదని అన్నారు పోసాని. 


హీరో ఇమేజ్ తో తనని 10 మంది చూడటానికి వస్తే హీరోలకు 10వేల మంది వస్తారు. వారంతా ఓటర్లుగా మారరని అన్నారు పోసాని. అయితే పోసాని చేసిన వ్యాఖ్యలపై నందమూరి ఫ్యాన్స్ లో అంతర్మధనం మొదలైంది. ఇప్పటికే కొందరు టిడిపి కార్యకర్తలు ఎన్.టి.ఆర్ వచ్చి టిడిపిని నిలబెడతాడని అనుకుంటుండగా పోసాని వ్యాఖ్యలు వారిని సంక్షోభంలో పడేస్తున్నాయి. ఇక అసలు వాస్తవానికి వస్తే తారక్ ఇప్పుడు సినిమాల మీదనే దృష్టి పెట్టాడు అతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎలా లేదన్నా మరో 10, 15 ఏళ్లు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: