ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయకుడు "నవీన్ పోలిశెట్టి. ఈయన గతంలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో అతని సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది  అనే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

 

నేను యాక్టర్‌ అవుతానని నాన్నతో చెప్తే.. 'నువ్వు సాఫ్ట్‌వేర్‌ అవ్వాలి. అదే నీ తలరాత అంతే. ఇదే రాసుంది. అదే నీ రక్తంలోనూ ఉంది' అన్నారు. ఇదేంట్రా బాబూ.. అనుకున్నాను. ఆయన కోసమే లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తే వెళ్లాను. అక్కడ మా బాస్ అదేంటి? ఇదేంటి? అంటూ ప్రశ్నలతో చంపేసేవాడు. ఇలా కాదని చెప్పి నటనపై దృష్టిపెట్టాలని బెంగళూరు వెళ్లాను. ఈ విషయం నాన్నకు చెప్పలేదు. తెలిస్తే తిడతారు.

 

అందుకే వర్క్‌ ఫ్రం హోం పెట్టుకుని పనిమీద బెంగళూరు వచ్చానని చెప్పాను. కానీ నాన్న రోజూ ఫోన్‌ చేసి లండన్‌ ఎప్పుడు వెళుతున్నావ్‌? అనేవారు. చాలా రోజుల నుంచి బెంగళూరులోనే ఉంటున్నానని నాన్నకు అనుమానం వచ్చి నన్ను ఇంటికి రమ్మన్నారు.  'బొమ్మరిల్లు' సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సిద్ధార్థ్‌కు మధ్య వచ్చే సన్నివేశం నాకు రియల్‌ లైఫ్‌లో జరిగింది. నేను లండన్‌ వెళ్లట్లేదు అని నాన్నకు చెప్పగానే ఆయన షాక్‌.

 

ఆయన భయమేంటంటే.. మాకు పెట్టుబడి పెట్టి సినిమా తీసే స్తోమత లేదు. ఇండస్ట్రీలో సాయం చేసేవారూ లేరు. ఎలా రాణిస్తానన్న భయం ఆయనది. మాటల మధ్యలో ఆయనకు యూట్యూబ్‌లో హిట్టయిన నా వీడియో గురించి చెప్పాను. ఇంత పాపులర్‌ అయిందంటే.. నాలో ఏదో టాలెంట్‌ దాగి ఉన్నట్లే కదా అని నమ్మారు. ఇప్పుడు నేను చేసిన 'ఏజెంట్‌.. ఆత్రేయ' సినిమా కూడా మంచి టాక్‌ అందుకుంది కాబట్టి ఆయనకు నాపై పూర్తి నమ్మకం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: