రాజశేఖర్  అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆగ్రహం, అంకుశం, ఆహుతి, తలంబ్రాలు ఇలా చాలా మూవీస్ లో ఆయన మరచిపోలేని నటనని చూపించారు. తరువాత రోజుల్లో రొమాంటిక్ పాత్రల్లోనూ మెరిసారు. ఆయన రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన అల్లరి ప్రియుడు అప్పట్లో బ్లాక్ బస్టర్.


ఇక రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన సత్తా చూపుతున్నారు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ మూవీ హిట్ అయింది. దాంతో మరిన్ని కొత్త మూవీస్ కి ఆయన రెడీ అవుతున్నారు లేటెస్త్ మూవీ కల్కి త్వరలో రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో రాజశేఖర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.


కల్కి మూవీ నా కెరీర్ లో ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుందని అన్నారు. ఈ మూవీని ప్రశాంత్ వర్మ బాగా డిజైన్ చేశాడని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. నాకు కూడా చిరంజీవి కొడుకులా ఒక కొడుకు ఉంటే బాగుండు.


నాతో అతను కూడా మూవీస్ ప్రొడ్యూస్ చేసేవాడు అంటూ ముచ్చట పడ్డాడు. రామ్ చ‌రణ్ తండ్రి కోసం సినిమాలు తీయడం బాగుంది. అంటూ రాజశేఖర్ కామెంట్స్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ ని చూసి తనకు కొడుకు లేడన్న బాధను మరో మారొ ఆయన ఇలా బయటపెట్టుకున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: