టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలు అక్కడ ఉన్న స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇస్తాయని చాలామంది అంటారు. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ సినిమాలంటే పడి చస్తారు. బన్నీ నటించిన ఏ సినిమా అయినా యూట్యూబ్ లో పెడితే ఆ సినిమాకు వ్యూస్ కుప్పలుతెప్పలుగా వస్తాయి. ఈ క్రమంలో యూట్యూబ్ లో అల్లు అర్జున్ బోయపాటి దర్శకత్వంలో నటించిన సరైనోడు సినిమాకు రికార్డులు చాలానే ఉన్నాయి.

Image result for bellamkonda srinivas and allu arjun

అంతగా ఈ సినిమా ను యూట్యూబ్ ఛానల్ లో ఆదరించారు బాలీవుడ్ జనాలు. అయితే తాజాగా ఇప్పుడు యూట్యూబ్ లో బన్ని సినిమాలకు పోటీ ఇస్తున్నాడు కాస్ట్లీ స్టార్ అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లు అర్జున్ కి చెక్ పెట్టే విధంగా ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ మరియు అత్యధిక లైక్స్ సంపాదించిన సినిమాగా ఉన్న రికార్డును బెల్లం బాబు నెల నాళ్ళలోనే చెరిపేసాడు.కేవలం రెండు నెలల్లోపే తన ప్లాప్ చిత్రం అయినటువంటి “కవచం” హిందీ డబ్బింగ్ చిత్రానికి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు.

Related image

అంతేకాకుండా సరైనోడు చిత్రం ఇప్పటికి 182 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 46వేల లైక్స్ ను రాబట్టగా కవచం హిందీ డబ్బింగ్ కు మాత్రం రెండు నెలల్లోపే 111 మిలియన్ వ్యూస్ మరియు ఏకంగా 6 లక్షల 93 వేల లైక్స్ సంపాదించాడు. దీంతో యూట్యూబ్ లో అల్లు అర్జున్ కి మంచి గట్టిపోటీ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 



మరింత సమాచారం తెలుసుకోండి: