ప్రఖ్యాత నటుడు మురళీ మోహన్ గారు వ్యాపారవేత్త గానూ, రాజకీయ నాయకుడిగానూ మంచి విజయాలు అందుకున్నాడు. ఈయన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తను వ్యాపారవేత్తగా ఇంతగా సక్సెస్ కావడానికి గల కారణాలు, ఇంకా సినిమాలు చేసే రోజుల్లోని అనుభవాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు.

 

ఈ విధంగా మహానటి సావిత్రి గారి జీవితంలోని అత్యంత విషాదకరమయిన రోజుల గురించి చెప్పాడు. తన జీవితంలో ఎక్కువగా బాధపడ్డ సందర్భం గురించి వివరిస్తూ, మహానటి చనిపోయినప్పుడు అంత్యక్రియల విషయం గురించి చెప్పాడు. సావిత్రి చనిపోయిందని తెలియగానే, దాసరి గారు,  అక్కినేని నాగేశ్వరరావుగారు హైదరాబాద్ నుంచి బయల్దేరి చెన్నై వెళ్ళారట.  సావిత్రి చనిపోయే ముందు రోజు కొంతమంది చూసి వెళ్ళారట.

 

సావిత్రి దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నామని, అంతటి మహానటి సావిత్రి గారి అంతిమ యాత్రలో ఎవరూ లేరని అది చూసి బాగా దుఃఖం వచ్చిందని, ఎవ్వరూ కూడా చూడడానికి రాలేదని, ఆ క్షణం  తను చాలా బాధపడ్డానని చెప్పాడు. జీవితంలో ఎక్కువగా బాధపడ్డ సందర్భం అదేనట.

 

దహన సంస్కారాలకు చుట్టు పక్కల ఉండే గుడిసెల వాళ్ళు వచ్చారట.  గుడిసె లో ఉండే వాళ్ళు మాత్రమే ఏడుస్తూ వచ్చారని ఆ క్షణం  మహానటి జీవితం ఇలా ముగిసి పోయిందని  చాలా బాధపడ్డాడట మురళీ మోహన్ గారు. మురళీ మోహన్ గారు 2014 నుండి 2019 వరకు లోక్ సభ     రాజమండ్రి నియోజక వర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: