టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ ‘మహంకాళి’సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.  ఒక దశలో ఆయన విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని..తమిళ, మళియాళ భాషల్లో విలన్ గా నటించబోతున్నారని రక రకాల కథనాలు వచ్చాయి.  కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ‘గరుడ వేగ’సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రాజశేఖర్.  తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలోనే రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. 

ఈ మూవీ తర్వాత మరికొంత గ్యాప్ తీసుకొని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరగా సి.కల్యాణ్ నిర్మాతగా 'కల్కి' చిత్రం నిర్మితమైంది.  ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.  గతంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. 

తాజాగా 'కొల్లాపూర్' ప్రాంతంలో అన్యాయాలు, అక్రమాలు ఎంతో గుట్టుగా సాగుతుంటాయి.  ఈ మిస్టరీని ఛేదించడానికి వస్తాడు కల్కి. ఈ ట్రైలర్ లో  'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు .. యుద్ధం చేయవలసింది రాముడే' అనే డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడానికి టీమ్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందనే చెప్పాలి. రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన ఈ సినిమా, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: