ఆర్ ఎక్స్ 100 సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు "కార్తికేయ". ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కార్తికేయ నుండి " హిప్పీ" సినిమా వచ్చింది. కానీ అది  అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ కార్తికేయకి అవకాశాలు బాగానే ఉన్నాయి. కె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న చిత్ర్ం "గ్యాంగ్ లీడర్". ఈ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ చేస్తున్నాడు.



అయితే తాజాగా కార్తికేయ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు చేసుకోవడం మామూలై పోయింది. ఆ మధ్య కిలికి ఛాలెంజ్ చూసాం. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లని తమ సినిమా ప్రచారాలకి కూడా వాడుకుంటున్నారు. ఆంగ్రీ మాన్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం " కల్కి". ఈ సినిమా టీజర్ విడుదలయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే మొన్న ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసారు.



ఈ పాటలో బ్రిటీష్ భామ రాజశేఖర్ తో డాన్సు చేయనుంది. అయితే రాజశేఖర్ కుమార్తె "శివానీ " ఈ పాటను పోస్ట్ చేస్తూ , ఈ పాటకి మీరు డాన్స్ చేయగలరా అని ఛాలెంజ్ విసిరింది. దానికి కార్తికేయ స్పందించి తను డాన్స్ చేసిన వీడియోను షేర్ చేసారు.   ‘రాజశేఖర్‌ సర్‌ ఈ వీడియో మీ కోసం. మీ సినిమాల్ని చూస్తూ పెరిగాను. 3 దశాబ్దాల తర్వాత కూడా సినిమాలపై మీకున్న ప్యాషన్‌ అందరికీ స్ఫూర్తిదాయకం. శివానీ రాజశేఖర్‌ నీ ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సవాలు స్వీకరించా.



 నీకు నా వెర్షన్‌ నచ్చిందని ఆశిస్తున్నా’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు.శివానీ ‘2 స్టేట్స్‌’ సినిమాతో నటిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అడివి శేషు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. బాలీవుడ్‌ హిట్‌ ‘2 స్టేట్స్‌’కు తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: