ఒక దశలో తన సినిమాలతో సంచలనాలు సృష్టించిన బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కొంత కాలంగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకంగా ఫ్యాన్, జీరో లాంటి సినిమాలు చేసినా హిట్ కావటం లేదు. 90లలో సర్కస్ అనే సీరియల్ లో నటించిన షారుఖ్ అటునుంచి సినిమాల్లోకి వచ్చి బాలీవుడ్ బాద్ షా గా ఎదిగాడు. ఒకదశలో ఇండియా అంటే క్రికెట్, షారుఖ్ ఖాన్ మాత్రమే.. అనేంతగా షారుఖ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

 

షారుఖ్-కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన “దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే” చిత్రం అతని కెరీర్ లో ఓ సంచలనం. 1996 అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకుని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ముంబయ్ లోని మరాఠా మందిర్ లో ఏకంగా 20 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా రన్ అయి అతిపెద్ద రికార్డును నెలకొల్పింది. ఇంతటి ఘనమైన రికార్డులు ఫ్యాన్స్ ఉన్న షారుఖ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

 

అదేంటంటే.. కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ఇవ్వాలని. తనను తాను రీకనెక్ట్ చేసుకోవటం కోసమే సినిమాలు ఆపేశానని అంటున్నాడు. తాను నటించిన గత నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడం, పిల్లలు పెద్దవాళ్లు కావడం, కూతురు సినిమాల్లోకి రానుండడం.. వాళ్ల కెరీర్ పై దృష్టి పెట్టడం వంటి కారణాలతో తాను కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ గ్యాప్ తాత్కాలికమేనా.. మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా అనేది తేలాలి. షారుఖ్ సినిమాలు చేయడంటే అతని ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: