'అ!' స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం `క‌ల్కి`. రాజ‌శేఖ‌ర్ హీరోగా శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

 

హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి'  ట్రైలర్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందించారు. ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. చాల గ్యాప్ తరువాత రాజశేఖర్ నుండి పోలీస్ పాత్ర లో వస్తున్న చిత్రమిది అంటూ...

 

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందే హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, ఇప్పుడీ హానెస్ట్‌ ట్రైలర్‌ డిజైన్‌ చేశాం. కమర్షియల్‌ ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలామంది ‘కల్కి’ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో కంపేర్‌ చేశారు. సినిమాలో కామెడీ, ఐటమ్‌ సాంగ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి.

 

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్‌ ట్రైలర్‌ కట్‌ చేశాం. సినిమా ఏంటనేది ఈ హానెస్ట్‌ ట్రైలర్‌ చెబుతుంది. 1983 నేపథ్యంలో కథ సాగుతుంది. పీరియడ్‌ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథలతో సినిమాలు తీయడానికి ఇష్టపడే దర్శకుణ్ణి నేను. చాలా రీసెర్చ్‌ చేసిన తర్వాత ‘కల్కి’ చేశా. ఇదొక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!’తో పోలిస్తే ‘కల్కి’ చాలా పెద్ద సినిమా. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: