Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 7:31 am IST

Menu &Sections

Search

హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!

హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సమంత పెళ్లయినా తానేం మారలేదని ఋజువుచేస్తుంది. గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా సమంతాకు సౌత్ అంతా భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా వివాహం తర్వాత సౌత్ లో హీరోయిన్ గా కొనసాగడం కష్టమైన విషయమే. ఫిలిం మేకర్స్ గ్లామరస్ పాత్రలు ఇవ్వలేరు.. పైగా  ఒక్కసారి శ్రీమతిగా మారిన హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరించరనే ఒక అభిప్రాయం కూడా ఉండేది.


  కానీ సమంతా అలాంటి అభిప్రాయాలను  పటాపంచలు చేసింది.  నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్లు సాధించి సౌత్ లో  కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది. అంతే కాదు.. సమంతా గ్లామరస్ ఫోటో షూట్లు చేసేందుకు ఏమీ వెనకాడడం లేదు.  ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అన్నట్టుగా ఇప్పటికే ఎన్నో సార్లు తన ఉద్దేశాన్ని క్లియర్ గా చెప్పేసింది.  మొదట్లో విమర్శలు చేసినవారు కూడా మెల్లిగా సర్దుకున్నారు. 


ఇదిలా ఉంటే తాజాగా సమంతా ఒక ఫోటో షూట్ చేసింది.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేశ బజాజ్ డిజైన్ చేసిన క్రీమ్ కలర్ ఛోళీ.. లెహెంగాలో ఒక యువరాణిలా పోజులిచ్చింది.  ఎక్కువ యాక్సెసరీస్ లేకుండా జస్ట్ మెడలో ఒక షార్ట్ నెక్లెస్.. ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తోంది.  మరో ఫోటోలో క్రీమ్ కలర్ ఛోళీ..థై స్లిట్ లైట్ పింక్ గౌన్ లో గ్లామర్ దివా లాగా పోజిచ్చింది.  ఈ డ్రెస్ కు మాత్రం మ్యాచింగ్ గా మెడలో పొడవాటి దండ.. కాళ్ళకు హై హీల్స్ ధరించి స్టైల్ గా నిలబడింది.ఈ ఫోటోలు పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. "ఆ గ్రేస్.. సింప్లీ సూపర్బ్".. "ఏంజెల్ లాగా ఉన్నావు".. "యూ ఆర్ ప్రెట్టీ సామ్".. "ఓ బేబీ.. అదుర్స్" అంటూ కామెంట్లు పెట్టారు. 

samantha
5/ 5 - (1 votes)
Add To Favourite