ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను ప్రక్కనబెట్టి సినిమాల్లో నటిస్తుంటే, అయన సోదరుడు పవన్ కళ్యాణ్, పూర్తిగా సినిమాలకు స్వస్తి పలికి రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నారు. ఎంత అన్నదమ్ములైనా ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయని, మరొక మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్, చిరు గురించి చెప్పుకొచ్చారు. మరైతే చిరంజీవి పూర్తిగా సినిమాల్లోనే కొనసాగుతారా అనేదానిపై మాత్రం స్పష్టత లేనట్లు సమాచారం. ఇకపోతే ఆ మధ్య టి సుబ్బరామిరెడ్డి, తాను మెగాబ్రదర్స్ చిరంజీవి, 

పవన్ కళ్యాణ్ ల కలయికలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పిన మాట అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ విషయమై ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, తాను మెగాబ్రదర్స్ తో చేయబోయే సినిమాను పూర్తిగా ఆపేయడం జరుగలేదని, అయితే ప్రస్తుతానికి దాని ఆలోచనను కాస్త ప్రక్కన పెట్టానని, కానీ రాబోయే మరికొద్ది రోజుల్లో మాత్రం ఆ సినిమా తప్పకుండా తీస్తానని సుబ్బరామిరెడ్డి తన సన్నిహితుకు ఇటీవల చెప్పారట. ఇక ఈ విషయం అటుంచితే, కొద్దిరోజుల క్రితం పవన్ ను సుబ్బరామిరెడ్డి గారి సినిమా విషయమై మీడియా ప్రశ్నించగా ఆయన దానిపై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు, 

ఇక చిరంజీవి కూడా ఇప్పటివరకు పవన్ తో కలిసి సుబ్బరామిరెడ్డి గారి సినిమాలో నటించబోతున్నాను అంటూ ఎక్కడా ప్రకటన కూడా చేయలేదు. పైగా ప్రస్తుతం తన సినిమాలు తాను ప్లాన్ చేసుకుంటూ చిరు ముందుకెళుతుంటే, తన రాజకీయ భవిష్యత్తుపై రాబోయే రోజుల్లో గట్టిగా ముందుకుసాగేందుకు పవన్ కృషి చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు సుబ్బరామి రెడ్డి గారు వారిద్దరితో కలిసి సినిమా చేస్తారా అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక మరోవైపు త్రివిక్రమ్ కూడా వరుసగా చిత్రాలు ప్లాన్ చేస్తుండడంతో ఇక ఈ ప్రాజక్ట్ అటకెక్కినట్లే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటో, అసలు మెగాబ్రదర్స్ తో సుబ్బరామిరెడ్డి గారు సినిమా ఎప్పుడు తీస్తారో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: