హాట్ భామల్లో షమ సికందర్ ఒకరు. క్షణాల్లో సోషల్ మీడియాను వేడెక్కించే సత్తా గల హాట్ బ్యూటీ. కెరీర్ మొదట్లో నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.  దీంతో బుల్లి తెరలో సెటిల్ అయిపోయింది. 'సీఐడీ'.. 'బాల్ వీర్' లాంటి సీరియల్స్ తో పాటుగా 'ఝూమ్ ఇండియా'.. 'బూగీ వూగీ' లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. 'మాయ'.. 'అబ్ దిల్ కి సున్' లాంటి వెబ్ సీరీస్ లలో నటించింది. 


టీవీ సీరియల్స్ తో.. వెబ్ సిరీస్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ భామ హాబీ ఏంటంటే సోషల్ మీడియాలో మంటలు పెట్టి ఆ వెచ్చదనంతో చలికాచుకోవడం. తాజాగా షామా  అదేపని చేసేసింది. తన తాజా ఫోటోలకు "ఈ నెల నేను సూపర్ లక్కీ.. ఎందుకంటే రెండు మ్యాగజైన్లకు కవర్ పేజీపై నేను ఉన్నాను #ఆస్పైరింగ్ షీ #కల్చర్ వెడ్డింగ్ మ్యాగజైన్" అంటూ షామా  క్యాప్షన్ ఇచ్చింది.


ఆ రెండు కవర్ పేజీల ఫోటోలను తన ఇన్ స్టా లో షేర్ చెయడంతో నెటిజన్లకు 'రెండు లడ్డూలు కావాలా నాయనా?" అని అడిగినట్టుంది. ఆస్పైరింగ్ షీ మ్యాగజైన్ కవర్ పేజిలో పింక్ బికినీ ధరించి ఈతకొలను నీటిలోనే తన అందాలను ఒడుపుగా వడ్డించింది.  ఘాటు పోజిస్తూనే నంగనాచిలా ఒక చేతిని తన మొహానికి దగ్గరగా పెట్టుకుంది.ఇక రెండో కవర్ పేజి కల్చర్ వెడ్డింగ్ మ్యాగజైన్ పై వైట్ ప్యాంట్  సూట్ ధరించి మోడరన్ దివాలా గా ఝాకాస్ పోజిచ్చింది. ఆ వీ నెక్... అందులోని కనిపించే అందాలు ఈ రోజు మంగళవారాన్ని కాస్తా మంగళవరంగా మార్చేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: