సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘శివ’అప్పటికీ..ఎప్పటికీ చలన చిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే మూవీ అంటారు. ఈ సినిమాతో విలనీజం అంటే ఇలా ఉండాలనే కొత్త ట్రెండ్ తీసుకు వచ్చారు వర్మ.  కత్తులు, తుపాకులతో ఉండే సీన్లు ఈ మూవీతో సైకిల్ చైన్, బ్యాట్లతో ఫైట్లు చాలా నేచురల్ గా తెరకెక్కించారు.  సొసైటీలో ఉండే గుండాలు, కాలేజీల్లో జరిగి గొడవలు ఈ సినిమాలో ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని విధంగా మలిచారు. ఈ సినిమాతో నాగార్జున మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

ఈ సినిమాలో విలన్ గా పరిచయం అయిన జేడీ చక్రవర్తి తర్వాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు.  తాజాగా జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శివ మూవీ షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓ సంఘటన గుర్తుకు చేసుకున్నారు.  'శివ' సినిమా కోసం ఇరానీ కేఫ్ లో నాకు, నాగార్జున కు  ఫైట్ సీన్ ప్లాన్ చేశారు.

ఆ విషయం తెలిసి చాలామంది జనాలు అక్కడికి వచ్చేశారు.  నేను ఇరానీ కేఫ్ నుంచి బయటికి వెళుతున్నాను, నాగార్జునగారు లోపలికి వస్తున్నారు. ఇంతలో నా భుజం నాగార్జునకు తాకడంతో ఏయ్ ఎటుచూసి నడుస్తున్నావ్?' అన్నారు. 'లేదండీ నేను చూడలేదు' అన్నాను. 'ఏంటి తగిలితే సారీ చెప్పాలని కూడా నీకు తెలియదా? పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్?' అన్నారు. దాంతో నేను కూడా వెనక్కి తగ్గలేదు, కాస్త మర్యాదగా మాట్లాడండి అన్నాను..అంతే నాగార్జున ఒక్కటిచ్చాడు దాంతో నేను కిందపడిపోయాను.

వెంటనే లేచి నాగార్జున కాలర్ పట్టుకున్నా, అంతే ఆయన మనుషులు నా వద్దకు పరెగెత్తుకుంటూ వచ్చారు..వారిని వారించారు నాగార్జున. ఆ తర్వాత అక్కడ తన వారికి ఇది షూటింగ్ అని మీరు కంగారు పడొద్దని చెప్పారు.  వాస్తవానికి వర్మ ఏదైనా చాలా నేచురల్ గా రావాలని చూస్తుంటారు.  ఈ నేపథ్యంలోనే ఈ సీన్ క్రియేట్ చేశారు, ఈ విషయం నాకు నాగార్జున కు తెలుసు. మొత్తానికి ఆ సీన్ చాలా బాగా వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: