చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కామన్. ఆ కోవలోనే హీరోగా మారుతున్నాడు మాస్టర్ తేజ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు, బాచి వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన కుర్రాడే ఈ తేజ. బాలనటుడుగా యాభై సినిమాల వరకూ నటించిన మాస్టర్ తేజ ఇప్పుడు మిస్టర్ తేజగా రాబోతున్నాడు. బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఓ బేబీ’ సినిమాలో సమంతకు మనవడుగా నటించాడు.


లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ లో తేజ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు.మంచి ఈజ్ తో నటించనట్టు తెలుస్తుంది.తన లుక్ చూసి చాలామంది ‘‘ఇతనేనా చిన్ననాటి ఇంద్ర’’ ఆశ్చర్యపోతున్నారు..ఇపుడు తేజ సజ్జ హీరోగా కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నాడు.దానికోసం మంచి లైనప్ కూడా సెట్ చేసుకున్నాడు.


సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తేజ సజ్జ ఆల్రెడీ హీరోగా ఓ సినిమా కూడా చేయబోతున్నాడు..అంతే కాదు..ఓ హ్యాపెనింగ్ యంగ్ డైరెక్టర్ -ఎస్టాబ్లిష్ డ్ బ్యానర్ కలయిక లో మరో సినిమా కూడా ఫైనల్ అయిందని సమాచారం.దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన తేజ మంచి హీరో గా కూడా సెటిలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: