హీరో రాజశేఖర్ కి 'గరుడ వేగ' చాలాకాలం తర్వాత హిట్టిచ్చిన సినిమా. ఒకరకంగా ఈ హీరోకి ఇది కం బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్‌గా కల్కి తర్వాత గరుడ వేగ సినిమాకి సీక్వెల్ చేస్తానని ప్రకటించాడు హీరో రాజశేఖర్. కానీ ఆ ప్రకటనలో కాస్త క్లారిటీ మిస్సయింది. వినిపించీ వినిపించనట్టు, దాచీదాచనట్టుగా, చెప్పి చెప్పనట్టుగా గా చెప్పి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అవును గరుడ వేగ సీక్వెల్ ఉంది కానీ నాకు తెలియదంటున్నాడు ఈ సీనియర్ హీరో. 


"గరుడవేగ-2 ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయాలి. సి. కల్యాణ్ ప్రొడ్యూస్ చేస్తే సూపర్ గా ఉంటుంది. సబ్జెక్ట్ నేను వినలేదు. వాళ్లు డిస్కస్ చేసుకున్నారు. చాలా బాగుందని చెప్పేశారు. గరుడవేగ కంటే నెక్ట్స్ లెవెల్ లో ఉందని చెప్పారు. నాకు ఎప్పుడు వినిపిస్తారో చూడాలి." ఇలా గరుడ వేగ సినిమాపై వెరైటీగా రియాక్ట్ అయ్యాడు రాజశేఖర్. ఆయన చెప్పాలనుకుంది ఇదేనో లేక భాష సమస్యో తెలీదు గాని ఈ సినిమా స్టోరీ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుకున్నారట. తనకు మాత్రం తెలియదట. 


కానీ కల్కి తర్వాత చేస్తే గరుడ వేగ-2 సినిమానే చేస్తానని ప్రకటించాడు. కల్కి సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు రాజశేఖర్. 
ఈ ట్రైలర్‌ను 25 న విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా రాజశేఖర్ కి ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అని టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: